Friday 9 May 2008

బ్రహ్మ...పగలు...రాత్రి...రోజు...

మనందరికీ ఒక రోజు అంటే 24 గంటలు, ఒక రోజులో ఒక పగలు, ఒక రాత్రి ఉంటాయి. మరి మనల్ని సృష్టించే బ్రహ్మ కి ఒక పగలు, ఒక రాత్రి, ఒక రోజు, అంటే ఎంత?

ఆరు కనురెప్పలపాటు ఒక విఘడియ

60 విఘడియలు ఒక ఘడియ

7.5 ఘడియలు ఒక జాము

8 జాములు ఒక రోజు

7 రోజులు ఒక వారం

రెండు వారాల ఒక రోజు ఒక పక్షం

రెండు పక్షాలు ఒక నెల

పన్నెండు నెలలు ఒక సంవత్సరం

అలాంటి 4,32,000 సంవత్సరాలు ఒక "కలియుగం"

దీనికి రెండు రెట్లు (ద్వి + పర = ద్వాపర) అంటే 8,64,000 సంవత్సరాలు "ద్వాపర యుగం"

కలియుగానికి (త్రి) మూడు రెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు "త్రేతా యుగం"

అదే కలియుగానికి (కృత) నాలుగు రెట్లు అంటే 17,96,000 సంవత్సరాలు "కృత యుగం"

ఈ నాలుగు యుగాలు కలిసిన మొత్తం అంటే 43,20,000 సంవత్సరాలు ఒక "మహాయుగం".

ఇది బ్రహ్మకి ఒక పగలు

అలాగే మరొ మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు ఒక రాత్రి

వెరసి 86,40,000 సంవత్సరాలు బ్రహ్మకి ఒక రోజు

ఇటువంటి రోజులు వంద బ్రహ్మగారి పరమాయుర్ధాయం

వాటిలొ మొదటి 50 రొజులు గడచిపోయి (పూర్వార్థం)ద్వితీయ పరార్థం (రెండవ 50 రోజుల్లొ మొదటి రోజు) ప్రారంభంలొ మనం ఉన్నాం

2 comments:

దైవానిక said...

అటువంటివి 100 సంవత్సరాలు కదా బ్రహ్మ ఆయుర్థాయం ? 100 రోజులాన్నారేవిటి ?

Sesha Sai said...

నేను చదివిన 2 పుస్తకాలలొ 100 రోజులని వుంది. అందుకని అదే రాసాను.