Monday 16 June 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 3 (కోహినూర్ వజ్రం)

కోహినూర్ అంటే "వెలుగుల కొండ" అని అర్థం. దీని బరువు 108.93 కేరెట్లు. ఇది ప్రసిద్ది చెందిన వజ్రాలన్నిట్లో పొడవైనది. ఈ వజ్రం తెల్ల రంగులొ వుంటుంది. దీనికి శాపగ్రస్తమైన వజ్రం గా పేరు ఉంది. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారి వంశం నాశనం కావటం, వజ్రాన్ని కలిగి ఉన్న వారికి ఆకస్మిక మరణం సంభవించటం జరుగుతుందని ఒక నమ్మకం.

16 వ శతాబ్దంలో దీనిని మొఘల్ సుల్తాన్ బాబరు మాళ్వ రాజుల నుంచి సంపాదించాడు. తర్వాత ఇది షాజహాను కోసం తయారు చెయ్యబడిన "నెమలి సింహాసనం" లో అమర్చబడినట్లు భావించబడుతోంది. పర్షియను వంశం విఛ్చిన్నం అయిన తర్వాత ఈ వజ్రం భారతదేశం లోకి ప్రవేశించింది.

నాదిర్ షా రాజు హత్య చెయ్యబడ్డప్పుడు అతని అంగరక్షకుడు ఈ వజ్రంతో ఆఫ్ఘనిస్తాన్ కు పారిపోయాడు. ఆ తర్వాత ఇది పంజాబు రాజు అయినా రంజిత్ సింగు వద్దకు చేరింది. సిక్కులతో జరిగిన యుద్దంలొ గెలిచిన బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ ఈ వజ్రాన్ని కప్పం కింద తీసుకొని బ్రిటిషు రాణి క్వీన్ విక్టోరియా కి 1850 లో బహుకరించింది. ఇండియా నుంచి వచ్చినప్పుడు ఈ వజ్రం బరువు 1986 కెరెట్లు. ఆ తర్వాత 108.93 కెరట్లు గల వజ్రం గా కట్ చెయ్యబడినది.

బ్రిటిషు రాణి దీనిని తన అభరణము గా ధరించింది. తర్వాత దీనిని రాజ మకుటంలొ అమర్చారు. ఈ మకుటాన్ని క్వీన్ అలెగ్జాండ్ర, క్వీన్ మేరీ ధరించారు. 1937 లో క్వీన్ ఎలిజబెత్ సిం హాసనం ఎక్కినప్పుడు ఈ కిరీటం అమె ధరించింది. ప్రస్తుతం ఇది టవర్ ఆఫ్ లండను లో ఉంది.

No comments: