Tuesday 4 November 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 5 (హొప్ వజ్రం)

ఈ వజ్రం బరువు 45.52 కేరెట్లు. ఇది నీలి రంగులో వుంటుంది. దీనిని కొన్న వ్యక్తి "హెన్రీ థామస్ హొప్" పేరు మీద దీనికి హొప్ వజ్రం అని పేరు వచ్చింది. దీనికి కూడ దురద్రుష్టమైన వజ్రంగా పేరు ఉంది.

ఈ వజ్రానికి చెందిన గతంలొకి వెళితే, 1642 లో ఈ వజ్రం ఇండియా నుంచి యూరప్ కు తీసుకు రాబడింది. 14 వ లూయీ రాజు ఈ వజ్రాన్ని కొన్నాడు. అప్పుడు దీని బరువు 112 కేరెట్లు. అతడు దీనిని 67.50 కేరెట్లు వజ్రంగా కోయించి సాన పెట్టించాడు. ఫ్రెంచి విప్లవం కాలంలొ ఇది దొంగిలించబడింది.

తర్వాత ఈ వజ్రం బరువు మరింత కోల్పోయి 1830 లొ అమ్మకానికి రాగా ఇంగ్లండ్ దేశస్థుడైన హొప్ కొన్నాడు. వారసత్వంగా హొప్ కొడుకు ఈ వజ్రాన్ని పొందాడు. దీని ప్రభావం వలన హొప్ కొడుకు తన ఆస్తి మొత్తం కొల్పొయాడు. తర్వాత కాల క్రమంలొ ఇది ఒక అమెరికన్ వితంతువు ఎడ్వర్డ్ మెక్లేన్ (Mrs. Edward McLean) వద్దకు చేరింది.

ఇది పొందటం తొనే వీరి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అమె ఒక్కగానొక్క కొడుకు ప్రమాదవశాత్తు మరణించాడు. అమె కుటుంబం విచ్చిన్నం అయ్యింది. అమె తన సంపదనంతా కోల్పోయింది. దానితో విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

తర్వాత హారి విన్ స్టన్ (Harry Winston) అనే న్యూయార్క్ కు చెందిన వజ్రాల వ్యాపారి 1949 లొ దీనిని కొని అమ్మకానికి పెట్టగా అతని ఖాతాదారులు ఎవరు దీనిని ముట్టుకోవటానికి కూడా ఇష్టపడలేదు. ప్రస్తుతం ఇది వాషింగ్టన్ లోని స్మితొసోనియన్ ఇన్స్టిట్యూట్ మ్యూజియం (Smithosonian Institute Museum) లొ వుంది.

Friday 29 August 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 4 (స్పూన్ మేకర్ వజ్రం)

ఈ వజ్రం బరువు 86 కేరెట్లు. ఈ వజ్రం గురించి చాలా కథలు ప్రచారంలొ ఉన్నాయి. దీనికి ఈ పేరు రావటానికి కారణం దీనిని మొదట గా కనుకొన్న వ్యక్తి దీనిని ఒక చెత్త కుప్పలొ చూసాడట. అతను దీనిని మారకం వేసి మూడు చెక్క చెంచాలు తీసుకున్నాడట. అందుకని దీనికి స్పూన్ మేకర్ అని పేరు వచ్చిందట.

ఇంక దీని చరిత్ర గమనిస్తే పికొట్ (Pikot)అని పేరుగల ఫ్రెంచి వ్యక్తి దీనిని ఇండియా లొ మద్రాసు మహారాజు నుంచి కొన్నాడు. అతను దానిని ఫ్రెంచి దేశానికి తీసుకువెళ్ళాడు. ఆక్కడ ఇది దొంగతనం చెయ్యబడింది. తర్వాత ఒక వేలంశాలలొ ప్రఖ్యాతి చెందిన కాసనొవ (Casanova) దీనిని కొన్నాడు.

తర్వాత దీనిని నెపొలియన్ తల్లి లెటిజియ రమొలినొ (Letizia Ramolino)కొనటం జరిగింది. ఆమె ఈ వజ్రాన్ని మిగతా నగలతో పాటు అమ్మి నెపొలియన్ ఎల్బా నుంచి పారిపోవటానికి సహయం చేసింది.

కొన్నాళ్ళ తర్వాత టెపెదెలెన్లి అనే రాజు దగ్గర పని చెసే వ్యక్తి ఒక అతను దీనిని కొని ఖజనాకు చేర్చాడు. టెపెదెలెన్లి రాజ్యంలొ వుద్యమం వచ్ఛి అతను చంపబడ్డాడు. ఆప్పుదు ఈ వజ్రం మొత్తం ఖజానా తొ పాటు టర్కీ రాజ మహలుకు చేరింది. ఈ వజ్రాన్ని ప్రస్తుతం టర్కీలొ కసికి (Kasicki) అని పిలుస్తున్నారు.

Monday 16 June 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 3 (కోహినూర్ వజ్రం)

కోహినూర్ అంటే "వెలుగుల కొండ" అని అర్థం. దీని బరువు 108.93 కేరెట్లు. ఇది ప్రసిద్ది చెందిన వజ్రాలన్నిట్లో పొడవైనది. ఈ వజ్రం తెల్ల రంగులొ వుంటుంది. దీనికి శాపగ్రస్తమైన వజ్రం గా పేరు ఉంది. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారి వంశం నాశనం కావటం, వజ్రాన్ని కలిగి ఉన్న వారికి ఆకస్మిక మరణం సంభవించటం జరుగుతుందని ఒక నమ్మకం.

16 వ శతాబ్దంలో దీనిని మొఘల్ సుల్తాన్ బాబరు మాళ్వ రాజుల నుంచి సంపాదించాడు. తర్వాత ఇది షాజహాను కోసం తయారు చెయ్యబడిన "నెమలి సింహాసనం" లో అమర్చబడినట్లు భావించబడుతోంది. పర్షియను వంశం విఛ్చిన్నం అయిన తర్వాత ఈ వజ్రం భారతదేశం లోకి ప్రవేశించింది.

నాదిర్ షా రాజు హత్య చెయ్యబడ్డప్పుడు అతని అంగరక్షకుడు ఈ వజ్రంతో ఆఫ్ఘనిస్తాన్ కు పారిపోయాడు. ఆ తర్వాత ఇది పంజాబు రాజు అయినా రంజిత్ సింగు వద్దకు చేరింది. సిక్కులతో జరిగిన యుద్దంలొ గెలిచిన బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ ఈ వజ్రాన్ని కప్పం కింద తీసుకొని బ్రిటిషు రాణి క్వీన్ విక్టోరియా కి 1850 లో బహుకరించింది. ఇండియా నుంచి వచ్చినప్పుడు ఈ వజ్రం బరువు 1986 కెరెట్లు. ఆ తర్వాత 108.93 కెరట్లు గల వజ్రం గా కట్ చెయ్యబడినది.

బ్రిటిషు రాణి దీనిని తన అభరణము గా ధరించింది. తర్వాత దీనిని రాజ మకుటంలొ అమర్చారు. ఈ మకుటాన్ని క్వీన్ అలెగ్జాండ్ర, క్వీన్ మేరీ ధరించారు. 1937 లో క్వీన్ ఎలిజబెత్ సిం హాసనం ఎక్కినప్పుడు ఈ కిరీటం అమె ధరించింది. ప్రస్తుతం ఇది టవర్ ఆఫ్ లండను లో ఉంది.

Monday 26 May 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 2 (అర్లాఫ్ వజ్రం)

దీని ప్రస్తుత బరువు 189.62 కేరెట్లు. కనుగొన్నపుడు దీని బరువు 300 కెరేట్లుగా భావించబడుతుంది. రంగు నీలం కలిసిన ఆకుపచ్చ. ఇది అత్యంత శుద్దమైనది.


దీని చరిత్రను పరిశీలిస్తే, ఇది మొదటగా శ్రీరంగం లోని ఒక విష్ణు దేవాలయంలో గల విగ్రహం యొక్క కన్నుగా అమర్చబడి వుండేదట. దీనిని హిందువులా వేషం ధరించిన ఒక ఫ్రెంచి సైనికుడు 1700 ల ప్రాంతంలొ అపహరించాడట. అతను మద్రాసు చేరుకొని అక్కడ ఒక ఓడ కెప్టెనుకు 2,000 పౌండ్లకు అమ్మాడట.



కాలక్రమంలో ఇది ఆంస్టరడం చేరుకొంది. అక్కడ దీనిని రష్యాకు చెందిన గ్రెగొరి అర్లాఫ్ (Grigori Orloff) 90,000 పౌండ్లకు కొనడం జరిగింది. దానిని అతను తన మాజీ ప్రియురాలైన కేథరీన్ ది గ్రేట్ కు కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి దీనికి అర్లాఫ్ వజ్రం అని పేరు వచ్చింది.


కాని కేథరీన్ ఈ వజ్రాన్ని తీసుకుంది గాని గ్రెగోరి కి మాత్రం దక్కలేదు. ఆ దిగులుతోనే గ్రెగోరి 1783 లొ మరణించాడు. కేథరీన్ ఈ వజ్రాన్ని తన రాజ దండం లొ అమర్చుకుంది. తర్వాత 1812 లొ రష్యనులు మాస్కో పై నెపోలియన్ దాడికి భయపడి ఒక పూజారి సమాధిలొ దీనిని దాచారట. కానీ నెపోలియన్ ఈ దాచిన స్తలాన్ని కనుక్కొని దీనిని తీసుకోవటానికి సమాధి దగ్గరకి వచ్చాడట. కాని సరిగ్గా ఒక సైనికుడు ఈ వజ్రాన్ని తాకబోతుండగా పూజారి అత్మ ప్రత్యక్షం అయ్యి భయంకరమైన శాపం పెట్టిందట. దానికి భయపడి నెపోలియన్ ఈ వజ్రాన్ని తీసుకోకుండానే వెనుదిరిగాడట. ప్రస్తుతానికి ఇది మాస్కో లోని రష్యన్ డైమండ్ ఫండ్ లో భద్రపరచబడి వున్నది.

Wednesday 21 May 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 1 (కలినాన్ వజ్రం)

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల గురించి నాకు తెలిసిన వివరాలు తెలియచేయటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఒక్కొక్క భాగంలో ఒక్కో వజ్రాన్ని గురించిన విశేషాలు రాస్తాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.

కలినాన్ I: ఇది ప్రపంచంలొ కట్ చేయబడిన వజ్రాలలో పెద్దది. దీని బరువు 530.20 కేరెట్లు (106.04 గ్రాములు). దీనిని దక్షిణాఫ్రికా లోని ట్రాన్స్ వాల్ లో 1905 వ సంవత్సరం లొ కనుగొనటం జరిగింది. దక్షినాఫ్రికా లోని కలినాన్ లొ వున్న ప్రీమియర్ డైమండ్ మైనింగ్ కంపెనీ లొ పని చేసే ఫ్రెడెరిక్ వెల్స్ అనే ఆయన ఈ వజ్రాన్ని కనుకున్నాడు. దీనిని కనుగొన్న కంపెని పనిచేసే వూరి పేరునే దీనికి పెట్టటం జరిగింది.

జోసెఫ్ అశ్చెర్, కంపెని ఆఫ్ ఆంస్టర్డం కలిసి సుమారు 6 నెలలు పరీక్షించి చివరికి మూల వజ్రం అయిన కలినాన్ ను 105 అద్భుతమైన వజ్రాలుగా (9 పెద్ద వజ్రాలు 96 చిన్నవజ్రాలు) కట్ చెయ్యటం జరిగింది. అసలు వజ్రం బరువు 3106.75 కేరెట్లు. కట్ చేసిన వజ్రాలలొ అతి పెద్దదానికి కలినాన్ I అని పేరు పెట్టారు. దీనినే గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా(Great Star of Africa)అని కూడ అంటారు. ఇది 74 ముఖాలను కలిగి ఉంటుంది.

1907 లో ఈ వజ్రాన్ని ఇంగ్లండు రాజు అయిన ఏడవ కింగు ఎడ్వర్డు (King Edward VII of England) కి ఇవ్వటం జరిగింది. దానిని అతడు తన రాజ దండం లో అమర్చుకోవటం జరిగింది. ప్రస్తుతానికి ఇది మిగిలిన బ్రిటీషు రాజ వంశస్థుల ఆభరణాలతో పాటు టవర్ ఆఫ్ లండన్ లో భద్రపరచబడి వుంది. మూల వజ్రం నుంచి విడగొట్టబడిన రెండో అతి పెద్ద వజ్రానికి కలినాన్ II అని పేరు పెట్టటం జరిగింది. దీని బరువు 317.40 కేరెట్లు. దీని రంగు తెలుపు. ఇది కూడా టవర్ ఆఫ్ లండన్ లో భద్రపరచబడి వుంది.

1985 లొ గొల్డెన్ జూబిలి వజ్రం (545.67 కేరెట్లు) కనుగొనేంతవరకు ప్రపంచంలో సాన పెట్టబడిన వజ్రాలలో అతి పెద్ద వజ్రంగా కలినాన్ చెలామణి అయింది. మొదటి సారి కలినాన్ వజ్రం కనుగొనబడినప్పుడు లభించిన కొన్ని గుర్తుల ఆధారంగా అది ఇంకా చాలా పెద్ద వజ్రంలో భాగమని భావించటం జరిగింది. కాని ఇప్పటివరకు మిగిలిన భాగం ఎమైందొ తెలియలేదు.