Tuesday 4 November 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 5 (హొప్ వజ్రం)

ఈ వజ్రం బరువు 45.52 కేరెట్లు. ఇది నీలి రంగులో వుంటుంది. దీనిని కొన్న వ్యక్తి "హెన్రీ థామస్ హొప్" పేరు మీద దీనికి హొప్ వజ్రం అని పేరు వచ్చింది. దీనికి కూడ దురద్రుష్టమైన వజ్రంగా పేరు ఉంది.

ఈ వజ్రానికి చెందిన గతంలొకి వెళితే, 1642 లో ఈ వజ్రం ఇండియా నుంచి యూరప్ కు తీసుకు రాబడింది. 14 వ లూయీ రాజు ఈ వజ్రాన్ని కొన్నాడు. అప్పుడు దీని బరువు 112 కేరెట్లు. అతడు దీనిని 67.50 కేరెట్లు వజ్రంగా కోయించి సాన పెట్టించాడు. ఫ్రెంచి విప్లవం కాలంలొ ఇది దొంగిలించబడింది.

తర్వాత ఈ వజ్రం బరువు మరింత కోల్పోయి 1830 లొ అమ్మకానికి రాగా ఇంగ్లండ్ దేశస్థుడైన హొప్ కొన్నాడు. వారసత్వంగా హొప్ కొడుకు ఈ వజ్రాన్ని పొందాడు. దీని ప్రభావం వలన హొప్ కొడుకు తన ఆస్తి మొత్తం కొల్పొయాడు. తర్వాత కాల క్రమంలొ ఇది ఒక అమెరికన్ వితంతువు ఎడ్వర్డ్ మెక్లేన్ (Mrs. Edward McLean) వద్దకు చేరింది.

ఇది పొందటం తొనే వీరి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. అమె ఒక్కగానొక్క కొడుకు ప్రమాదవశాత్తు మరణించాడు. అమె కుటుంబం విచ్చిన్నం అయ్యింది. అమె తన సంపదనంతా కోల్పోయింది. దానితో విరక్తి చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

తర్వాత హారి విన్ స్టన్ (Harry Winston) అనే న్యూయార్క్ కు చెందిన వజ్రాల వ్యాపారి 1949 లొ దీనిని కొని అమ్మకానికి పెట్టగా అతని ఖాతాదారులు ఎవరు దీనిని ముట్టుకోవటానికి కూడా ఇష్టపడలేదు. ప్రస్తుతం ఇది వాషింగ్టన్ లోని స్మితొసోనియన్ ఇన్స్టిట్యూట్ మ్యూజియం (Smithosonian Institute Museum) లొ వుంది.